Category: Sirivennela

  • సిరివెన్నెల రసవాహిని!

    సుప్రసిద్ధ సినీ సాహితీ విమర్శకులు పైడిపాల గారు సిరివెన్నెల గారి సినీ గీతాలను విశ్లేషిస్తూ రాసిన సరికొత్త పుస్తకం “సిరివెన్నెల రసవాహిని“. ఆయన్ని సిరివెన్నెల గారే స్వయంగా ఈ పుస్తకం రాయమని అడిగారట! కానీ ఈ పుస్తకం పూర్తి అయ్యే సమయానికి సిరివెన్నెల శివైక్యం చెందారు. ఆయన స్మృతికి నివాళి అర్పిస్తూ పైడిపాల గారు గౌరవంతో, ప్రేమతో రాసిన పుస్తకం ఇది. “రసవాహినీ స్వాగతం! జీవరసధునీ స్వాగతం” అన్న సిరివెన్నెల గంగావతరణ గీతాన్ని స్ఫురింపజేస్తూ “సిరివెన్నెల రసవాహని”…

  • “మళ్ళీ ఒకసారి” వినాలనిపించే సిరివెన్నెల పాట!

    సాలూరి రాజేశ్వరరావు గారికి నివాళిగా సింగీతం శ్రీనివాసరావు గారు సంగీతం సమకూర్చి సమర్పించిన “చల్ల గాలిలో“ ఆల్బం లో వేటూరి రాసిన పాట గురించి ఇంతకు ముందు ప్రస్తావించాను.  ఈ ఆల్బంలో మొత్తం 8 పాటలుంటే, బాలూ గారు రెండు అద్భుతమైన పాటలు పాడారు – ఒకటి వేటూరి పాటైతే ఇంకోటి సిరివెన్నెలది.  “మళ్ళీ ఒకసారి” అంటూ మొదలయ్యే ఈ పాటలో సిరివెన్నెల సాహిత్యం నాకు చాలా ఇష్టం. అద్భుతమైన భక్తితత్త్వాన్ని ప్రతిపాదించిన ఈ పాటని నేను…

  • సిరివెన్నెల జయంతి – 2022

    ఈ రోజు (మే 20, 2022) సిరివెన్నెల గారి జయంతి. రోజంతా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన పాటలు వింటూ, తానా వారు ఘనంగా నిర్వహించిన ఆయన జయంతి ఉత్సవాల వీడియో చూస్తూ గడిపాను. ఆయన పాటలు వింటూ ఉంటే నాకు కలిగిన అనుభూతితో రాసుకున్న కొన్ని వాక్యాలు ఇవి! గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు. “అంత దూరాన ఉన్నావెన్నెలగా చెంతనే ఉన్నాఅంటూ ఊయలలూపింది జోలాలి!” ఆ వెన్నెల మీ పాటఈ దూరం మా లోటునింగి చేరిన జాబిలి…

  • సిరివెన్నెల గారికి కన్నీటి వీడ్కోలు

    నేను అత్యంత అభిమానించే గీత రచయిత, గొప్ప కవి, మహా మేధావి, పెద్ద మనసున్న మనిషీ అయిన మా గురువు గారు సిరివెన్నెల ఈ రోజు మమ్ము విడిచి వెళ్ళిపోయారు. కార్తీక బహుళ ఏకాదశి నాడు శివైక్యం పొందారు. ఇది గొప్ప విషాదమూ, తట్టుకోలేని నిజమే అయినా ఆయన పాటలనే తలుచుని ఓదార్పు పొందాల్సిన పరిస్థితి. ఒక సూర్యుడు అస్తమించాడుకాదు కాదుఆ సూర్యుడు శివజ్యోతిగా నిత్యం వెలుగుతూనే ఉంటాడుదర్శనం చాలించాడు అంతేసిరివెన్నెల కురుస్తూనే ఉంటుంది!ఎన్నో ఇచ్చిన గురువు…

  • అరవై ఐదేళ్ళ పాటల వసంతం!

    ఈ రోజు (మే 20) సిరివెన్నెల గారి 65 వ పుట్టినరోజు. వయసు మీదపడుతున్నా ఆయన మేధలో చురుకు తగ్గలేదు, పాటలో పదును తగ్గలేదు, మాటలో మనసు తగ్గలేదు. ఆయనలో పసితనం అలానే ఉంది, పాటల్లో చూపే చిలిపితనం పెరుగుతూనే ఉంది, ఆయనలోని మనిషితనం ఎదుగుతూనే ఉంది. ముఖ్యంగా పాట ద్వారా ఆహ్లాదమో సాహిత్యమో అందించడమే కాక ఇంకా ఏదో – ఒక తాత్త్వికత, ఒక దిశానిర్దేశం, ఒక మేలుకొలుపు – అందించాలన్న తపన అచ్చంగా అలాగే…

  • విశ్వనాదామృతం

    విశ్వనాథ్ గారి సినిమాలు నన్ను చాలా స్పందింపజేస్తాయి. ఆయనంటే నాకో ఆరాధన. ఆయనపై తీసిన “విశ్వనాదామృతం” ఇన్నాళ్ళకు చూడడం మొదలుపెట్టాను. త్రివిక్రం చివర్లో విశ్వనాథ్ గురించి గొప్పగా చెప్పారు. నిజమే, విశ్వనాథ్ సినిమాలంటే ఆత్మతో సంభాషణ! విశ్వనాథ్ గారి సినిమాల గురించి బాలు చెప్పిన ఎన్నో అపురూపమైన విషయాల ఎపిసోడ్! ఎన్ని పాటలను గుర్తుచేశారో! ఆపద్భాంధవుడిలో నాగఫణిశర్మ గారి పద్యం ఎంత బావుందో! మునుపు గమనించలేదు! స్వర్ణకమలం గురించి చేసిన ఎపిసోడ్ బావుంది. “ఆకాశంలో ఆశల హరివిల్లు”…

  • వైరముత్తు కవిత – సిరివెన్నెల పాట!

    మణిరత్నం తన కొత్త చిత్రం CCV (తెలుగులో నవాబ్) కి ఎప్పటిలానే తమిళ కవి వైరముత్తు కవితనొకటి తీసుకుని రెహ్మాన్ చేత ట్యూన్ చేయించారు. ఆ పాటే వైరల్ అయిన “మళై కురువి” అన్న పాట. దీనిని తమిళంలో రెహ్మానే పాడారు. ఈ పాట గురించి వైరముత్తు చెప్పిన ఆసక్తికరమైన సంగతి ఒకటి నెట్లో కనిపించింది – “Mazhai Kuruvi’ — is about a man who’s enjoying the sight of a sparrow…

  • “శైలజారెడ్డి అల్లుడు” పాటల్లో సిరివెన్నెల!

    “శైలజారెడ్డి అల్లుడు” అనే సినిమా పేరు నేను ఇంతకు ముందు వినలేదు కానీ ఈ సినిమాలో రెండు పాటలు సాహిత్యపరంగా బావున్నాయి. రెండూ సిరివెన్నెల రాసినవే! సంగీతం గోపీ సుందర్! “కసురుకునే కనుబొమలో కలహము ఓడనీ..బిడియపడే ఓటమిలో గెలుపుని చూడనీ!” అంటూ ఓ పొగరున్న అమ్మాయి ప్రేమలో పడిన సందర్భాన్ని వర్ణించిన “తను వెతికిన తగు జత నువ్వేననీ” అనే ఫీమేల్ సోలో గీతం వెంటనే ఆకట్టుకుంది. “సత్య యామిని” చాలా చక్కగా పాడిందీ పాట. ఈ…

  • అహో ఒక పాటకు నేడే పుట్టినరోజు!

    ఈ రోజు (మే 20) గురువుగారు సిరివెన్నెల గారి పుట్టినరోజు. 2010 లో ఆయన పుట్టినరోజుకి ఓ పాట రాశాను. అంతకంటే ముందు “అల్లరి ప్రియుడు” చిత్రానికి గురువుగారు రాసిన పాప్యులర్ గీతం – “అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు” ట్యూన్ కి ఒక పాట మొదలుపెట్టి ఆపేశాను. ఆ పాట ఈ మధ్య కనపడ్డంతో నాకు ఈ 2018 పుట్టినరోజుకి పూర్తిచేద్దాం అనే బుద్ధి పుట్టింది. సత్సంకల్పమే! కానీ నాకు అట్టే సమయం లేదు. ఎలాగో…

  • సమ్మాన్యుడు!

    “సమ్మాన్యుడు” సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి నాన్నగారు డా. సి.వి.యోగి గారిపై ఆయన సన్నిహితులు రాసిన వ్యాసాల సంకలనం. ఈ పుస్తక రచనకి పూనుకుని, పుస్తకంలో ఎక్కువ వ్యాసాలు రాసినది , సిరివెన్నెల గారి తమ్ముడు శ్రీ చేంబోలు శ్రీరామశాస్త్రి. శ్రీరామశాస్త్రి గారు పుస్తకానికి నాందిలో ఈ పుస్తకాన్ని రాయడానికి మొదటి కారణం – “యోగిగారి వ్యక్తిత్వం వలన ప్రభావితం అయిన మా అన్న సిరివెన్నెల గారు ఆయన సూచించిన ఏకసూత్ర జీవన విధానాన్ని అనుసరిస్తూ అత్యున్నతమైన స్థాయికి చేరి,…

Blog at WordPress.com.