Category: Music

  • సిరివెన్నెల రసవాహిని!

    సుప్రసిద్ధ సినీ సాహితీ విమర్శకులు పైడిపాల గారు సిరివెన్నెల గారి సినీ గీతాలను విశ్లేషిస్తూ రాసిన సరికొత్త పుస్తకం “సిరివెన్నెల రసవాహిని“. ఆయన్ని సిరివెన్నెల గారే స్వయంగా ఈ పుస్తకం రాయమని అడిగారట! కానీ ఈ పుస్తకం పూర్తి అయ్యే సమయానికి సిరివెన్నెల శివైక్యం చెందారు. ఆయన స్మృతికి నివాళి అర్పిస్తూ పైడిపాల గారు గౌరవంతో, ప్రేమతో రాసిన పుస్తకం ఇది. “రసవాహినీ స్వాగతం! జీవరసధునీ స్వాగతం” అన్న సిరివెన్నెల గంగావతరణ గీతాన్ని స్ఫురింపజేస్తూ “సిరివెన్నెల రసవాహని”…

  • మామ మహదేవన్ సంగీతంపై podcast

    మామ కె.వి.మహదేవన్ పాటలపై చేసిన ఓ అద్భుతమైన ఐదు భాగాల podcast ఇది. వింటూ చాలా ఆనందం పొందాను! ఎప్పుడో వివిధభారతిలో విన్న ఎన్నో పాటలు గుర్తు చేసుకున్నాను. అలనాటి సినీ సంగీత సాహిత్య మాధుర్యంలో మునిగితేలాను. తప్పక వినండి! వేటూరి కొమ్మకొమ్మకో సన్నాయి లో మామపై రాసిన వ్యాసం చదివిన స్ఫూర్తితో ఈ podcast కి ఆలోచన చేసిన @nag_vasireddy గారికి, ఎన్నో పాటలని ఏరి వాటిలో సంగీత విశేషాలను వివరించిన @musicofarun గారికి, మామ…

  • చంద్రబోస్ గారికి అభినందనలు!

    గీతరచయిత చంద్రబోస్ గారు రాసిన నాటునాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ (Best original song) రావడం నాకు చాలా ఆనందం కలిగించింది. అయితే కీరవాణి గారి పాటల్లో అసలు ఇది గొప్ప పాటేనా, అవార్డ్ కి అర్హమైనదేనా అన్న చర్చ ఒకటి ట్విటర్ లో మొదలైనప్పుడు మిత్రుడు పవన్ సంతోష్ ఒక చక్కని విశ్లేషణ చేశాడు. దానికి స్పందనగా నేను కూడా చంద్రబోస్ గారి ప్రతిభ గురించి కొన్ని సంగతులు రాశాను. సిరివెన్నెల, వేటూరి, సినారె,…

  • కార్తీక సంగీత ఆరాధన!

    ఈ కార్తీకమాసంలో నేను శివగీతాలు వింటూ ఆ మహాదేవునిపై భక్తిని పెంచుకునే ప్రయత్నం చేశాను. నేను విన్న పాటల్లో నాకు బాగా నచ్చిన కొన్నిటిని ఇక్కడ పంచుకుంటున్నాను. బాలమురళి గారి అద్భుతమైన గళంలో త్యాగరాజ శివకృతులు వినడం పరమానందం! వీటిలో “నాదతనుమనిశం” పాట అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. సామవేదం షణ్ముఖ శర్మ గారు శివపదం పేరిట శివునికి పదార్చన చేశారు. ఈ పాటలన్నీ లాలిత్యంతో శివజ్ఞానాన్ని అందించేవే! ఆ పాటల్లో ఒకటి: సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు…

  • కొన్ని వేటూరి పాటలు!

    ఈ జనవరి 29 వేటూరి గారి పుట్టినరోజు సందర్భంగా మా వేటూరి గ్రూప్ సభ్యులం కొందరం Google Meet ద్వారా కలిసి ఆయన పాటలని చర్చించుకుని ఆనందించాము. ఆయన పాటలు ఎప్పుడూ విననివి కొన్ని, ముందు విన్నా ఇప్పుడు ఎవరో ఆ పాటలో సౌందర్యాన్ని వివరిస్తే మళ్ళీ విన్నవి కొన్ని, ఎప్పుడూ వింటున్నా మళ్ళీ మళ్ళీ ఆనందం పంచేవి మరికొన్ని…ఇలా ఎన్నో పాటలని స్మరించుకోవడం జరిగింది ఈ రోజు. వాటిల్లో కొన్నిటిని నా గుర్తు కోసం ఇక్కడ…

  • ఓ మారా! దిల్ చోరా!

    “దియా” అనే ఒక చిత్రం కోసం ఈ మధ్య నేను ఒక ప్రేమ గీతాన్ని చాలా ఇష్టపడి రాసుకున్నాను! కొన్ని కారణాల వలన చిత్రంలో నా పాట తీసుకోకపోయినా, ఈ పాట మటుకు నాకు సంతృప్తిని, రాసేటప్పుడు ఆనందాన్ని ఇచ్చింది. దియా అనే ఒక అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలతో ముడిపడిన ప్రేమకథ ఈ సినిమా. కన్నడంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి తీసుకు వస్తున్నారు. నిజానికి సినిమాలో పాటలు లేవు, అయితే సినిమా థీం…

  • తెలుగుకు అక్షరాల గుడి, భారత సంస్కృతీనిధి – వేటూరి పాట

    ఈ రోజు (జనవరి 29) వేటూరి గారి 85 వ జయంతి. ఆయన పాటల్ని తలచుకుంటూ, ఆయన ప్రతిభకి అక్షర నీరజనాలు అర్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు, వ్యాసాలు రావడం చూసి ఆనందం కలిగింది.  ఎప్పుడూ వినే సినిమా పాటలు కాక వినని పాటలు ఏమైనా విందామని వేటూరి గారి అబ్బాయి రవిప్రకాష్ గారు నడుపుతున్న “మీ వేటూరి” చానల్ లో దివిసీమ గురించి, తుంగభద్ర గురించి రాసిన పాటలూ, వినాయకునిపై రాసిన వినాయక ప్రశస్తి పద్యాలు విన్నాను.…

  • A small tribute to SPB

    Sometimes you realize how much you miss someone only after they are gone. SPB’s death is the loss of a great singing talent and also a great human being. It is a personal loss, not that of a celebrity. I never realized how much he became one of my own, almost like a favorite uncle,…

  • విశ్వనాదామృతం

    విశ్వనాథ్ గారి సినిమాలు నన్ను చాలా స్పందింపజేస్తాయి. ఆయనంటే నాకో ఆరాధన. ఆయనపై తీసిన “విశ్వనాదామృతం” ఇన్నాళ్ళకు చూడడం మొదలుపెట్టాను. త్రివిక్రం చివర్లో విశ్వనాథ్ గురించి గొప్పగా చెప్పారు. నిజమే, విశ్వనాథ్ సినిమాలంటే ఆత్మతో సంభాషణ! విశ్వనాథ్ గారి సినిమాల గురించి బాలు చెప్పిన ఎన్నో అపురూపమైన విషయాల ఎపిసోడ్! ఎన్ని పాటలను గుర్తుచేశారో! ఆపద్భాంధవుడిలో నాగఫణిశర్మ గారి పద్యం ఎంత బావుందో! మునుపు గమనించలేదు! స్వర్ణకమలం గురించి చేసిన ఎపిసోడ్ బావుంది. “ఆకాశంలో ఆశల హరివిల్లు”…

  • గౌతమిపుత్ర శాతకర్ణి పాటలు

    “కంచె” చిత్రంతో క్రిష్ – సిరివెన్నెల – చిరంతన్ భట్ కలిసి సృష్టించిన సంగీత సాహితీ దృశ్యకావ్యానికి పరవశించిన వాళ్ళలో నేనొక్కణ్ణి. మళ్ళీ అదే కాంబో “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రంలో కుదిరింది కాబట్టి ఈ సినిమా ఆడియోపై నా అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆల్బం మొదటిసారి విన్నప్పుడు బాణీలు అంతగా ఎక్కలేదు కానీ వినగా వినగా ఆకట్టుకునే సంగీతం. సిరివెన్నెల సాహిత్యం కూడా చక్కగా అమరింది. చాలా కాలం తర్వాత ఉదిత్ నారాయణ్ గొంతు వినిపించిన…

Blog at WordPress.com.