Category: My Poems

  • జీవిత ప్రేయసి

    జీవిత ప్రేయసినిగట్టిగా వాటేసుకున్నప్పుడు అంది“జాగ్రత్త సుమా! వదలలేకపోతే ఎలా” అని!  చూపులతో ఆమె సౌందర్యాన్నిఆస్వాదిస్తున్నప్పుడు అంది “దగ్గరయ్యి నా నవ్వులతో శ్రుతి కలపకపోతే ఎలా” అని! (ఇది రొమాంటిక్ గా కనిపిస్తున్నా నిజానికి ఆధ్యాత్మిక దృష్టితో రాసినది. ఓ ఉదయం సముద్ర తీరాన నిలుచున్నప్పుడు పుట్టిన ఆలోచన. detachment గురించి భగవద్గీతతో సహా ఎన్నో గ్రంధాలు ఏకరువు పెట్టినా, ఆ art అంత సులభం కాదనిపిస్తుంది. నదిలో కొట్టుకుపోవడమో, లేక ఒడ్డున తడవకుండా కూర్చోడమో కాక జలకాలాడాలి అంటే…

  • The fight for truth!

    A poem inspired by the toxic debates I see daily on Twitter! I fight your truthAnd you fight mineOur world a battle over factsCan’t we each hold a piece of truth?And build it together As we unbuild and rebuild ourselves In its light?Maybe then,However painful or unjust it may be,Truth will heal us!

  • చదవక తప్పని బ్రతుకు పుట! 

    జీవితమనేది పూలబాట కాదు, కత్తుల వంతెన. ఏవో కష్టాలు, బాధలు ఉంటూనే ఉంటాయి. వాటితో సహజీవనం చెయ్యక తప్పదు. ఈ అంశంపై నేను ఈ మధ్య రాసుకున్న ఓ కవిత.  శిఖరాలు అధిరోహిస్తూ కొందరు జీవితాన్ని దర్శిస్తారు లోయల్లోకి జారిపడుతూ నేను జీవితాన్ని నేర్చుకున్నాను! పడ్డాక కెరటంలా పైకి లేవాలంటారు కానీఒక్కసారి ముక్కలుగా విరిగిపడ్డాకమళ్ళీ ఒక్కటిగా నిలబడ్డం ఎంత కష్టమో నాకు తెలుసు! అయినా సరేనన్ను నేను తట్టుకుంటూ, నిలబెట్టుకుంటూబొట్టూ బొట్టూ పేర్చుకుంటూ మళ్ళీ పారుతున్నాను! నక్షత్రాల…

  • శిలను కదిలించే అల!

    భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేని అహంకారం నాది. కానీ త్యాగయ్య, అన్నమయ్య వంటి మహనీయుల కీర్తనలు విన్నప్పుడో, టాగోర్ గీతాంజలి (చలం అనువాదంలో) చదివినప్పుడో, ఎప్పుడో కాస్త భక్తి అవగాహనలోకి వస్తుంది. ఈ మధ్యనే “శ్రీరాం సర్” అని చాలామంది ఆప్యాయంగా పిలుచుకునే ఒకాయన రాసిన “హసిత బాష్పాలు” (smiling tears) అనే 18 కవితల సంకలనం చదివి గొప్ప అనుభూతి పొందాను. ఆ ప్రేరణతో రాసుకున్న కవిత ఇది:  పోరాడి ఎంతగా అలసినా ఓడానని ఒప్పుకోవాలనిపించదు…

  • నింగికి చేరిన “కమలం”!

    మా నాన్నమ్మ కమలాదేవి నవరాత్రులకు కులదైవం కామేశ్వరిని మనసారా అర్చించుకుని చతుర్దశి రోజున (అక్టోబరు ఎనిమిదో తారీఖు) ఆ దేవి సన్నిధికి చేరుకుంది. 85 ఏళ్ల జీవన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని, పెద్ద సంసారాన్ని సమర్థవంతంగా నడిపి, పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. పండిత వంశంలోంచి వచ్చిన తను ఊపిరి సలపని కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే సంస్కృతంలో M.A సాధించింది. ఎన్నో పద్యాలు, పాటలు రాసింది. ఎంతో అద్భుతంగా పాడేది. ధైర్యం, ఉత్సాహం, చాతుర్యం కలగలసిన ఆమె…

  • Beauty in Silence!

    The boundless beauty Of the majestic ocean I stand in silent appreciation… Even a whisper is noise Taking a picture is distraction Words of poetry superfluous The roaring waves Spreading inside me Wash me in peace! I go deeper and expand myself I enter a wordless world! I embrace the ocean I become the ocean!…

  • You never know Sadhguru!

    You never know… When an ordinary interest in Sadhguru turns into an intense passion How he suddenly becomes the sole purpose of your life Is it His grace and divine blessing? Or is it infatuation and brain-washing? Who knows and who can decide? May be only your heart can But can it, if it is…

  • సిరివెన్నెల గారికి కన్నీటి వీడ్కోలు

    నేను అత్యంత అభిమానించే గీత రచయిత, గొప్ప కవి, మహా మేధావి, పెద్ద మనసున్న మనిషీ అయిన మా గురువు గారు సిరివెన్నెల ఈ రోజు మమ్ము విడిచి వెళ్ళిపోయారు. కార్తీక బహుళ ఏకాదశి నాడు శివైక్యం పొందారు. ఇది గొప్ప విషాదమూ, తట్టుకోలేని నిజమే అయినా ఆయన పాటలనే తలుచుని ఓదార్పు పొందాల్సిన పరిస్థితి. ఒక సూర్యుడు అస్తమించాడుకాదు కాదుఆ సూర్యుడు శివజ్యోతిగా నిత్యం వెలుగుతూనే ఉంటాడుదర్శనం చాలించాడు అంతేసిరివెన్నెల కురుస్తూనే ఉంటుంది!ఎన్నో ఇచ్చిన గురువు…

  • బ్రతుకు నేర్పిన నడక!

    మొన్న జూలై 29 న నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్నాను. ఆ సందర్భంలో ఒక్కసారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుని నేర్చుకున్నది ఏమిటి, ఇంకా నేర్చుకోవాల్సింది ఏమిటి, మార్చుకోవాల్సింది ఏమిటి అని ఆలోచించుకున్నప్పుడు పుట్టిన కవిత ఇది. జీవితంలో మంచీ చెడూ, లాభం నష్టం, కష్టం సుఖం ఇవన్నీ దొర్లుతూనే ఉంటాయి. ఇవి పూర్తిగా మన చేతుల్లో ఉండేవి కావు. వీటన్నిటి మధ్య మనని మనం ఎలా తీర్చిదిద్దుకున్నాం అన్నది మాత్రం మన చేతుల్లో ఉన్నదే! ఈ…

  • The sparkling ego!

    I look at the stars and think“How tiny they look, yet glowing!” The stars look at me and say“How tiny man is, yet gloating!” – A thought on a starry night, 5/11/2021

Blog at WordPress.com.