Category: Translations

  • వసతి గృహం (రూమీ)

    “The Guest House” అన్న రూమీ కవిత నాకు చాలా ఇష్టం. మనసుని కుదిపే అనుభూతులన్నిటితో స్నేహం ఎలా చెయ్యాలో చెప్పే దిక్సూచి ఈ కవిత. నాకు దగ్గరగా చేసుకోవడం కోసం తెలుగులోకి అనువదించుకున్నాను! వసతి గృహం మనిషి హృదయమొక వసతి గృహం ప్రతి ఉదయం ఓ కొత్త ఆగమనం ఓ ఆనందం, ఓ బాధ, ఓ సంకుచితత్వం… ఒక క్షణికమైన ఎరుక… ఇవన్నీ అనుకోని అతిథుల్లా వస్తాయి అన్నిటినీ ఆహ్వానించి ఆతిథ్యమివ్వు! ఇంటినంతటినీ దులిపి గదులన్నీ…

  • మూకం కరోతి వాచాలం!

    “మూకం కరోతి వాచాలం”  భగవద్గీత ప్రార్థనా శ్లోకాల్లో ఒకటి. ఆ శ్లోకానికి సాధారణంగా చెప్పే అర్థం ఇది: మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిమ్ యత్కృపా తమహం వందే పరమానందమాధవమ్! “ఎవ్వరి కృప మూగవానికి అద్భుతంగా మాటలిచ్చి, కుంటువానిని కొండలు దాటిస్తుందో, ఆ పరమానంద మాధవునికి వందనం!” యథాతథంగా చూస్తే దేవుడికి సాధ్యం కానిది లేదు,  మూగవాడికి మాటలివ్వడం వంటి అద్భుతాలు చెయ్యగలడు అనే అర్థం వస్తుంది.  స్వామి చిన్మయానంద  భగవద్గీతకి చేసిన  వ్యాఖ్యలో దీనికి…

  • సత్యం విరిసే పూదోట!

    ఆయన్ని చేరడానికి నేను తెలివితో వేసిన నిచ్చెనలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి కానీ ప్రయత్నాలని పరిత్యజించిన మరుక్షణం అవరోధాలన్నీ మటుమాయం! ఆయన తనకు తానే కరుణతో సాక్షాత్కరించాడు! అంతే తప్ప ఆయన్ని తెలుసుకోవడం నా తరమా? నా తెలివి గుమ్మం వరకే నడిపించింది ఆయన కటాక్షమే ద్వారాన్ని తెరిచింది! కానీ నిన్ను నీవు తెలుసుకోనంత వరకూ ఆయన్ని ఎలా తెలుసుకోగలవు? ఉన్నది ఒక్కటే ఎక్కువా లేదు, తక్కువా లేదు! తప్పల్లా రెంటిని చూడడమే ఏకత్వంలో ఏ దోషమూ లేదు నీ…

  • పిల్లలు

    ఖలీల్ జీబ్రాన్ రాసిన “ప్రొఫెట్” పుస్తకం గొప్ప ఆధ్యాత్మిక గ్రంధంగా పేరుపొందింది. “యండమూరి వీరేంద్రనాథ్” తన పుస్తకం “పడమటి కోయిల పల్లవి” లో ఈ పుస్తకంలోని కొన్ని కవితలకి చేసిన అనుసృజన ద్వారా నాకు “ప్రొఫెట్” గురించి తెలిసింది. మూలంలో చూస్తే గాఢమైన భావం ఎక్కువగా కనిపించింది కవిత్వం కన్నా. యండమూరి అనువాదంలో కవిత్వం చొప్పించాలనే తాపత్రయం ఎక్కువ కనిపించింది. పొడి పొడి మాటలలో మూలానికి దగ్గరగా అనువదిస్తే ఎలా ఉంటుందో చూద్దామని నేను ఎప్పుడో 2005లో…

  • నిశ్శబ్ద వసంతం

    పైకి చెప్పకు,పదిలంగా దాచేసుకో నీ కలలనీ, నీ అనుభూతులనీ! మసకచీకట్లను ఛేదిస్తూ నింగికి తారలెగసినట్టు మనసు లోతులనుంచి వెలుగురవ్వలు విరజిమ్మనియ్! దర్శించి పరవశించిపో మాట పెగలనీకు! ఎవరు వినగలరు నీ గుండెలో గీతాన్ని? నీ మనసు సెలయేటి గలగలల్ని? నీ లోలోపలి కలకలాన్ని? నిన్ను నువ్వు “మాట”గా పారేసుకున్న వేళ నీ ఉనికే అబద్ధమైపోతుంది ఇక్కడే, ఈ మానససరోవరంలోనే మాటల మలినం అంటక ముందే అనంతాన్ని దోసిలిపట్టుకో మనసుతోటలో గూడు కట్టుకుని నీదైన తలపు సామ్రాజ్యంలో తలదాచుకో!…

  • సంహారం

    సద్గురువుగా పిలవబడే “జగ్గీ వాసుదేవ్”, ఆధ్యాత్మిక గురువే కాక కవి కూడా. మొదట్లో ఆయన కవిత్వం నాకు పెద్ద గొప్పగా అనిపించేది కాదు. Mystics Musings అనే పుస్తంలో అనుకుంటా ఆయన రాసిన Unmaking అనే కవిత మాత్రం నా మనసు లోతులని తాకింది. ఈ కవితలోని మార్మికత, గాఢత నన్ను కట్టిపడేసింది. సద్గురువు ఇంత బాగా రాస్తారా అని గతంలో నేను చదివిన ఆయన కవితలు మళ్ళీ చదివాను. సరళంగా కనిపించే భావాల వెనుక ఉన్న…

  • బ్రతుకు శ్లోకం

    ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో మా ఇంగ్లీష్ టీచరు “రామచంద్ర” గారు, ఆఖరి క్లాసులో అందరికీ వీడ్కోలు తెలుపుతూ గడగడా ఒక పోయం చదివారు. కదిలించే లయతో ఎంతో ఉత్తేజకరమైన కవిత అది. నాకు ఎంతో నచ్చి తర్వాత ఆయన రూంకి వెళ్ళి ఆ కవితని నా డైరీలో రాసుకున్నాను. ఆ కవిత Longfellow రాసిన A Psalm of Life అన్నది – http://www.bartleby.com/102/55.html నన్ను ఎంతో ప్రభావితం చేసిన ఆ కవితకి తెలుగు అనువాదం ఇది.…

Blog at WordPress.com.