What is the lasting interest in your life?

Sometimes words of wisdom can strike you unexpectedly and make an impact. They may be the things you already know about. But something about the way they are said or your receptivity when you heard them can make a big impression on your heart. You suddenly see the wisdom pointed by those words. You understand … Continue reading What is the lasting interest in your life?

Advertisements

ఎన్నో పూలున్న తోట!

నా తోటలో ఎన్నెన్నో పూలు ప్రతీ పూవుదీ ఒకో పరిమళం ప్రతీ రేకులో ఒకో అందం ఇన్నిన్ని సుగంధాలని ఆస్వాదిస్తేనే మనసు పుష్పించేది ఈ అందాలన్నీ అద్దుకుంటేనే బుద్ధి వికసించేది మల్లె గుబాళింపుతో పాటూ గులాబీ ముళ్ళనీ పొదువుకోవాలి పూలగుత్తులు కోసుకుంటూనే బోసిమొక్కలనీ తడిమి సాకాలి మర్యాదలన్నీ మందారానికే అయితే సన్నజాజి చిన్నబుచ్చుకోదూ? కొన్ని పువ్వులే పూజకంటే దేవుడైనా ఒప్పుకోడు! ప్రతీ పువ్వునీ పలకరించాలి ప్రతీ నవ్వులో ఏకమవ్వాలి ప్రతీ పాటలో గొంతు కలపాలి నన్ను నేనే … Continue reading ఎన్నో పూలున్న తోట!

వేటూరి “కబీర్ వాణి”

వేటూరి సుందర్రామ్మూర్తి గారు గొప్ప కవి మాత్రమే కాదు, గొప్ప భక్తి ఉన్నవారు కూడా. ఈ “భక్తి” ఆయన సినిమాలకి రాసిన అనేక భక్తిపాటల్లో కనిపిస్తుంది. అయితే ఈ భక్తి సినిమాలను దాటి కూడా ప్రవహించిందనీ, ఆయన సొంత డబ్బులతో కొన్ని భక్తి కేసెట్లు “గీతాంజలి” శీర్షికన తీసుకువచ్చారని చాలా మందికి తెలియదు. ఈ సంగతిని “కొమ్మకొమ్మకో సన్నాయి” పుస్తకంలో ప్రస్తావిస్తూ ఇలా అన్నారాయన - “సినీగీతరచనకు దూరంగా, “నేనూ, నాదీ, నా కోసం” అనే స్పృహ … Continue reading వేటూరి “కబీర్ వాణి”

విశ్వనాదామృతం

విశ్వనాథ్ గారి సినిమాలు నన్ను చాలా స్పందింపజేస్తాయి. ఆయనంటే నాకో ఆరాధన. ఆయనపై తీసిన "విశ్వనాదామృతం" ఇన్నాళ్ళకు చూడడం మొదలుపెట్టాను. త్రివిక్రం చివర్లో విశ్వనాథ్ గురించి గొప్పగా చెప్పారు. నిజమే, విశ్వనాథ్ సినిమాలంటే ఆత్మతో సంభాషణ! https://youtu.be/KwZfEEmEdWQ విశ్వనాథ్ గారి సినిమాల గురించి బాలు చెప్పిన ఎన్నో అపురూపమైన విషయాల ఎపిసోడ్! ఎన్ని పాటలను గుర్తుచేశారో! ఆపద్భాంధవుడిలో నాగఫణిశర్మ గారి పద్యం ఎంత బావుందో! మునుపు గమనించలేదు! https://youtu.be/iebO7M5m5KM స్వర్ణకమలం గురించి చేసిన ఎపిసోడ్ బావుంది. "ఆకాశంలో … Continue reading విశ్వనాదామృతం

వైరముత్తు కవిత – సిరివెన్నెల పాట!

మణిరత్నం తన కొత్త చిత్రం CCV (తెలుగులో నవాబ్) కి ఎప్పటిలానే తమిళ కవి వైరముత్తు కవితనొకటి తీసుకుని రెహ్మాన్ చేత ట్యూన్ చేయించారు. ఆ పాటే వైరల్ అయిన "మళై కురువి" అన్న పాట. దీనిని తమిళంలో రెహ్మానే పాడారు. ఈ పాట గురించి వైరముత్తు చెప్పిన ఆసక్తికరమైన సంగతి ఒకటి నెట్లో కనిపించింది - "Mazhai Kuruvi’ — is about a man who’s enjoying the sight of a sparrow … Continue reading వైరముత్తు కవిత – సిరివెన్నెల పాట!

నైట్ ఫ్లైట్!

రెక్కలు కట్టుకు ఎగిరిపోవాలనుకోవడం బానే ఉంటుంది కానీ నేలని విడిచేప్పుడే తెలుస్తుంది మట్టితో బంధం! విమానం గాలిలోకి ఎగరగానే పుట్టింటిని విడిచి వెళుతున్న వధువులా నాలో ఏదో గుబులు! మళ్ళీ అత్తింటి మేఘాలు మెత్తగా మాట్లాడేదాకా మనసు కుదుటపడదు! చీకట్లోకి రివ్వున పైకెగిరిన విమానం నుంచి చూస్తే నగరం మెరిసే ముత్యాల ముగ్గు నేలకి దిగివచ్చిన తళుకుల గెలాక్సీ రాతిరి తల్లి ఒడిలో మెరిసే కలలతో హాయిగా నిదురించే పాపల్లా ఇళ్ళు ఏ తీపి కోసమో వెదుకులాడుతూ … Continue reading నైట్ ఫ్లైట్!

జీవితం మనోగతం చైత్రసంగమాలు!

ఇళయరాజా సంగీతం సమకూర్చిన ప్రభుదేవా చిత్రం "టైమ్" లో ఈ మధ్యే ఎప్పుడూ వినని ఓ చక్కని మెలొడీ సుజాత గొంతులో వినిపించింది - జీవితం, మనోగతం - చైత్రసంగమాలు అంకితం, స్వయంకృతం - గ్రీష్మ పంచమాలు "పియా" నో "ప్రియా" నో అనేసినా నయానో భయానో వినేసినా https://www.youtube.com/watch?v=lCzDlxrjRwk టైమ్ చిత్రంలో "ప్రేమేనంటావా" వంటి హిట్ పాటల మధ్య ఈ పాట కొట్టుకుపోయింది గానీ, ఇళయరాజా చాలా బాగా కంపోజ్ చేశారీ పాట! అలాగే గాయని … Continue reading జీవితం మనోగతం చైత్రసంగమాలు!